Cricket: డేవిడ్ వార్నర్ కనుసన్నల్లోనే బాల్ ట్యాంపరింగ్?

  • ఆసీస్ మీడియాలో ప్రముఖంగా బాల్ టాంపరింగ్ వివాదం
  • బాన్ క్రాఫ్ట్, స్మిత్, వార్నర్ పై రేపు చర్యలు తీసుకోనున్న సీఏ
  • వివాదానికి కారణం డేవిడ్ వార్నర్ అంటూ కథనాలు

బాల్‌ టాంపరింగ్‌ వివాదం ఆస్ట్రేలియా మీడియాలో ప్రధానంగా చోటుచేసుకుంటోంది. ఈ వివాదంపై మీడియాలో కథనాలు హోరెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బాల్ టాంపరింగ్ ఉదంతానికి ప్రధాన కారకుడు డేవిడ్ వార్నర్ అంటూ ఆసీస్ మీడియా సంస్థలు స్పోర్ట్స్ మెయిల్, ఫెయిర్ ఫాక్స్ పత్రికలు కథనాలు ప్రచురించాయి. దీంతోనే క్రికెట్ ఆస్ట్రేలియా వారిపై చర్యలకు ఉపక్రమిస్తోందని తెలుస్తోంది. స్మిత్ పై ఫీజు కోత, ఏడాది సస్పెన్షన్ చర్యలను ఐసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Cricket
devid warner
Cricket australia
  • Loading...

More Telugu News