IPL-2018: 'బిగ్ బాస్'ను వదిలిన ఎన్టీఆర్... ఐపీఎల్ కు వచ్చేశాడు!

  • ఐపీఎల్ తెలుగు ప్రచారకర్తగా ఎన్టీఆర్
  • తెలుగులోనూ ప్రసారం కానున్న వ్యాఖ్యానం
  • వెల్లడించిన స్టార్ టీవీ గ్రూప్

సెలబ్రిటీ రియాల్టీ షో 'బిగ్ బాస్' హోస్ట్ గా తప్పుకున్న హీరో ఎన్టీఆర్, ఐపీఎల్ 2018 బ్రాండ్ అంబాసిడర్ గా నియమితుడయ్యాడు. ఐపీఎల్ పోటీలు తెలుగు వ్యాఖ్యానంలోనూ ప్రత్యక్ష ప్రసారాన్ని చేయడానికి స్టార్ గ్రూప్ ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. స్టార్ మా మూవీస్ చానల్ తో పాటు మరికొన్ని చానల్స్ లోనూ ఐపీఎల్ పోటీలు తెలుగులో రాబోతున్న నేపథ్యంలో తెలుగు టెలికాస్ట్ లోకలైజేషన్ ప్రచారకర్తగా ఎన్టీఆర్ ను నియమించుకున్నట్టు స్టార్ టీవీ గ్రూప్ వెల్లడించింది. తన నేతృత్వంలో 'బిగ్ బాస్' వంటి షోను విజయవంతం చేసిన ఎన్టీఆర్, ఈ కొత్త బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తాడో వేచి చూడాలి.

IPL-2018
NTR
Star Maa
Star Group
  • Error fetching data: Network response was not ok

More Telugu News