Kakinada: కాకినాడలో వీరంగమాడిన మందుబాబులు... పోలీసులను తొక్కించుకుంటూ కారులో ఉడాయించిన వైనం.. వీడియో వైరల్!

  • సాధారణ తనిఖీలను చేపట్టిన కాకినాడ పోలీసులు
  • వారిని ఢీకొడుతూ వేగంగా వెళ్లిన మందుబాబులు
  • ఓ కానిస్టేబుల్ పరిస్థితి విషమం

తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టిన వేళ, ఐదుగురు మందుబాబులు వీరంగం సృష్టించారు. కాకినాడ ఎస్పీ ఆఫీసు ఎదుట జరిగిన ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. వివరాల్లోకి వెళితే, సాధారణ తనిఖీల్లో భాగంగా రహదారిపై పోలీసులు వాహనాలను చెకింగ్ కు చేస్తున్న వేళ, ఐదుగురు యువకులు వస్తున్న కారు కనిపించింది.

పోలీసులు ఆ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా, వారిని నెట్టుకుంటూ ముందుకు వచ్చింది. కారును ఆపేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నిస్తున్న వేళ, ఓ లా అండ్ ఆర్డర్ కానిస్టేబుల్ కారుకు బారికేడ్ ను అడ్డం కూడా పెట్టాడు. బారికేడ్ ను బలంగా ఢీకొట్టిన కారు, సదరు కానిస్టేబుల్ మీద నుంచి వేగంగా వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ కారులో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నట్టు అనుమానిస్తున్న పోలీసులు, కారు ఆచూకీ కోసం విచారణ చేపట్టారు. నిబంధనలను మీరడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, యాక్సిడెంట్ చేయడం, డ్రంకెన్ డ్రైవ్ వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

Kakinada
East Godavari District
SP Office
Drunk Driving
  • Error fetching data: Network response was not ok

More Telugu News