Bhagyalakshmi Dairy: అంబానీ, అమితాబ్, సచిన్, అక్షయ్... సెలబ్రిటీలు వాడే పాలు... ధర వింటే అవాక్కే!

  • సెలబ్రిటీలకు పాలను సరఫరా చేసే భాగ్యలక్ష్మీ డెయిరీ
  • మినరల్ వాటర్ ను మాత్రమే తాగే పశువులు
  • రోజుకు 25 వేల లీటర్ల ఉత్పత్తి మాత్రమే

ముఖేష్ అంబానీ, అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్... పరిచయాలు అక్కర్లేని పేర్లు. సెలబ్రిటీలుగా సమాజంలో అత్యున్నత స్టేటస్ లో ఉన్న వాళ్లే. వీళ్లందరికీ రోజువారీ వాడకం నిమిత్తం పాలను సరఫరా చేసేది ఎవరో తెలుసా? పుణె కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న భాగ్యలక్ష్మీ డెయిరీ.

వీరికి లీటరు పాలను రూ. 90కి సదరు సంస్థ యజమాని దేవేంద్ర షా అందిస్తాడు. మహారాష్ట్రలోని సెలబ్రిటీల్లో అత్యధికులు దేవేంద్ర షా కస్టమర్లే. కేవలం 22 వేల మందికి మాత్రమే ఈయన డెయిరీలోని పాల సరఫరా జరుగుతుంది. వీరికోసం రోజుకు 25 వేల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. ఇక దేవేంద్ర షా నిర్వహించే డెయిరీ విశేషాలు తెలుసుకుంటే, ఇక్కడి పశువులు శుద్ధి చేసిన మంచి నీళ్లను మాత్రమే తాగుతాయి. వాటికి నిత్యమూ మంచి పోషకాహారం అందుతుంది. పశువుల నుంచి పాలు తీయడం మొదలు, వాటి ప్యాకింగ్ వరకూ సమస్తం ఆటోమేటిక్ గా సాగిపోతుంది. సాధారణ పాలతో పోలిస్తే భాగ్యలక్ష్మీ డెయిరీ పాలు మరింత షోషకాలతో ఉంటాయట. అందుకే అంత రేటు, సెలబ్రిటీలకు మాత్రమే సరఫరా.

Bhagyalakshmi Dairy
Pune
Mumbai
Maharashtra
Milk
  • Loading...

More Telugu News