Telugudesam: చంద్రబాబుది ముమ్మాటికీ కుట్రే... మేము భాగస్వామ్యం కాబోము: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

  • నేడు చంద్రబాబు అఖిలపక్ష సమావేశం
  • హాజరు కాబోమని చెప్పిన బీజేపీ
  • ఇప్పటికే తాము రావడం లేదని చెప్పిన వైసీపీ

నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వివిధ పార్టీల నేతలను, వివిధ సంఘాల నాయకులను ఆహ్వానించి ప్రత్యేక హోదాపై చర్చను జరపాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు మరో కుట్రకు తెరలేపారని వ్యాఖ్యానించిన ఆయన, చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఆయన అఖిలపక్షాన్ని ఏర్పాటు చేశారని నిప్పులు చెరిగారు.

చంద్రబాబు కుట్రలో తాము భాగస్వామ్యం కాదలచుకోలేదని, ఈ అఖిలపక్ష సమావేశానికి బీజేపీ హాజరు కాబోదని తేల్చి చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కోసం తాను చేసిన తప్పిదాలను బీజేపీపై నెట్టివేసే ధోరణిలో టీడీపీ ఉందని ఆరోపించారు. కాగా, నేటి అఖిలపక్షానికి హాజరు కాబోమని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Telugudesam
Chandrababu
BJP
YSRCP
Vishnukumar Raju
  • Loading...

More Telugu News