Australia: బాన్‌క్రాఫ్ట్‌కి ఇది కొత్తేమీ కాదు.. ట్యాంపరింగ్ మనోడికి వెన్నతో పెట్టిన విద్య.. మరో వీడియో వైరల్!
- కేప్‌టౌన్ టెస్టులో బాన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్
- యాషెస్ సిరీస్‌లోనూ మనోడి ‘చేతివాటం’
- నెట్టింట్లో వైరల్ అవుతున్న మరో వీడియో
కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఆసీస్ ఆటగాడు కేమరాన్ బాన్‌క్రాఫ్ట్ తక్కువోడేమీ కాదని తాజాగా చక్కర్లు కొడుతున్న మరో వీడియో బయటపెట్టింది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లోనూ మనోడు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన విషయం ఇప్పుడు వైరల్ అయింది.
సిడ్నీలో జరిగిన ఐదో టెస్టులో బ్రేక్ అనంతరం ఆటగాళ్లంతా మైదానంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంటే బాన్‌క్రాఫ్ట్ మాత్రం ఓ చెంచా చక్కెర తీసుకుని తన జేబులో వేసుకున్నాడు. ఈ చక్కెరతో అతడు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు చెబుతున్నారు. ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. బంతి రూపాన్ని మార్చేందుకే అతడు చక్కెరను జేబులో వేసుకున్నాడని చెబుతున్నారు.
తాజా బాల్ ట్యాంపరింగ్ ఘటనపై విచారణ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) హెడ్ లియాన్ రాయ్ ఆధ్వర్యంలోని దర్యాప్తు బృందం దక్షిణాఫ్రికా బయలుదేరింది. విచారణ అనంతరం కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై జీవిత కాల నిషేధం విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.