Nara Lokesh: ట్రిలియన్ డాలర్లకు ఏపీ ఆర్థిక వ్యవస్థ: మంత్రి లోకేశ్

  • ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏపీ వాటా 20 శాతం
  • తిరుపతిలో 150 ఎకరాల్లో రిలయన్స్ పార్క్
  • ఒకే చోట లక్షమంది పనిచేసేలా కార్యాచరణ

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మరో దశాబ్ద కాలంలో ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మంత్రి లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్స్ రంగంలో జీరోగా ఉన్న రాష్ట్రం ఇప్పుడు 20 శాతం మార్కెట్ షేర్ సాధించిందని తెలిపారు. తిరుపతిలో 150 ఎకరాల్లో రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ పార్క్ ఏర్పాటు కానుందని చెప్పిన మంత్రి చిప్ డిజైన్ నుంచి పూర్తిస్థాయి వస్తువుల తయారీ వరకు అన్నీ ఇక్కడే తయారయ్యేలా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు.

ఒకే చోట లక్షమంది పనిచేసేలా ఫ్యాక్టరీల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు మంత్రి లోకేశ్ తెలిపారు. అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. రాయలసీమను తయారీ హబ్‌గా మారుస్తామన్నారు. అనంతపురానికి ఇప్పటికే కియా కార్ల కంపెనీ వచ్చినట్టు చెప్పారు. అలాగే హెచ్‌సీఎల్  కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినట్టు లోకేశ్ వివరించారు.

Nara Lokesh
Andhra Pradesh
Rayalaseema
  • Loading...

More Telugu News