BJP: అవిశ్వాస తీర్మానం చర్చకు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాం : బీజేపీ నేత జీవీఎల్

  • టీడీపీ కాకమ్మ కబుర్లను సభలో లేవనెత్తుతాం
  • లెక్కలు కట్టే ఉద్దండులు టీడీపీలో చాలా మందే ఉన్నారు
  • ఏపీకి చేసిన సాయాన్ని ప్రజల ముందు ఉంచుతాం
  • మీడియాతో జీవీఎల్ నరసింహారావు

అవిశ్వాస తీర్మానం ఎప్పుడు చర్చకు వస్తుందా అని ఎదురు చూస్తున్నామని, టీడీపీ కాకమ్మ కబుర్లను సభలో లేవనెత్తుతామని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ఏమిచ్చామో, ఏమివ్వలేదో లెక్కలు కట్టే ఉద్దండులు టీడీపీలో చాలా మందే ఉన్నారని, మొన్నటి వరకు కేంద్ర మంత్రులుగా ఉన్న టీడీపీ నేతలకు కేంద్రం ఎంత ఇచ్చిందో తెలియదా? మాతో చెట్టాపట్టాల్ వేసుకుని వారు తిరగలేదా? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఏపీకి చేసిన సాయాన్ని ప్రజలముందు ఉంచుతామని, నిజానిజాలేమిటో అప్పుడే తెలుస్తాయని, ప్రజల విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు తమపై నిందలు వేయడం తగదని అన్నారు. రాజకీయ కుతంత్రం, దుమారం కోసమే ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలిగిందని అన్నారు. 

BJP
gvl narasimha rao
  • Loading...

More Telugu News