Pawan Kalyan: పవన్ కు ఏం తెలుసని రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు? : నక్కా ఆనంద్ బాబు

  • కేంద్రంపై అవిశ్వాసం పెడితే మద్దతు కూడగడతానన్నారుగా!
  • హైదరాబాద్ లో కూర్చుని పవన్ ఏం చేస్తున్నారు ?
  • జగన్ కేంద్రం పక్షమేనని తేలిపోయింది
  • విజయసాయిరెడ్డితో రాజీనామా చేయించాలి : ఆనంద్ బాబు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏం తెలుసని రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు? అని ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రంపై అవిశ్వాసం పెడితే ఢిల్లీ వెళ్లి మద్దతు కూడగడతానన్న పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో కూర్చుని ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత  జగన్ పైనా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈడీ అటాచ్ చేసిన రూ.40 కోట్లను విడుదల చేయించుకున్న జగన్, కేంద్ర ప్రభుత్వ పక్షమేనని తేలిపోయిందని అన్నారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేస్తారనడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానంటున్న జగన్, రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డితో ఎందుకు రాజీనామా చేయించట్లేదని ప్రశ్నించారు.  

Pawan Kalyan
nakka anand babu
  • Loading...

More Telugu News