Sri Reddy: టాలీవుడ్ సీనియర్లకు నటి శ్రీరెడ్డి క్షమాపణలు

  • టాలీవుడ్‌లో 90 శాతం మంది లుచ్ఛాలు, బ్రోకర్లేనన్న వ్యాఖ్యలు చేసిన నటి
  • తన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకం కాదని, నోరు జారి అన్నానని వివరణ
  • ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ ముఖంగా టాలీవుడ్ పెద్దలకు సారీ

తెలుగు సినీ రంగంపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి శ్రీరెడ్డి అందుకు ఓ న్యూస్ ఛానల్ ముఖంగా క్షమాపణలు చెప్పింది. నోరు జారి అలా ఆరోపణలు చేశానని, ఉద్దేశపూర్వకంగా మాత్రం కాదని ఆమె టాలీవుడ్ పెద్దలకు సారీ చెప్పింది. టాలీవుడ్‌లో 90 శాతం మంది లుచ్ఛాలు, బ్రోకర్లు ఉన్నారని...చివరకు బడా హీరోలు కూడా రాజకీయ నేతలకు అమ్మాయిలను తారుస్తున్నారని...దర్శకనిర్మాతలు తెలుగమ్మాయలకు అవకాశాలివ్వకుండా పరభాషా హీరోయిన్ల వెంట పడుతున్నారని...ఇటీవల ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ ఇంటర్వూలో శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. తెలుగులో ఎ ఫిల్మ్ బై అరవింద్, నచ్చావులే, చందమామలో అమృతం, గోల్కొండ హైస్కూల్, ఈ రోజుల్లో, చమ్కక్ ఛల్లో లాంటి సినిమాల్లో శ్రీరెడ్డి నటించింది.

Sri Reddy
Tollywood
Filmmakers
Heros
Casting couch
  • Loading...

More Telugu News