Adah Sharma: అమ్మమ్మతో నటి ఆదా శర్మ స్టెప్పులు...వీడియో వైరల్

  • తన అమ్మమ్మతో కలిసి చేసిన డాన్స్ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన హార్ట్ ఎటాక్ సుందరి
  • 'సోనూ కే టిటు కి స్వీటీ' చిత్రంలోని 'బామ్ డిగ్గీ డిగ్గీ' పాటకు స్టెప్పులు
  • సోషల్ మీడియాలో వైరల్‌గా వీడియో...1,314,718 పైగా వ్యూస్

తెలుగులో దర్శకుడు పూరి జగన్నాథ్ తీసిన 'హార్ట్ ఎటాక్' చిత్రంతో యువత హార్ట్ బీట్ పెంచిన ముద్దుగుమ్మ ఆదా శర్మ తన అమ్మమ్మతో కలిసి స్టెప్పులు వేసింది. వారిద్దరూ కలిసి చేసిన డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్‌లో '1920' చిత్రం ద్వారా అడుగుపెట్టిన ఈ భామ తనకు సమయం దొరికినప్పుడల్లా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఏవో ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తాజాగా అప్‌లోడ్ చేసిన ఈ వీడియోకి నెటిజన్ల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకు ఈ వీడియోకి 1,314,718 పైగా వ్యూస్ నమోదయ్యాయి. 'సోనూ కే టిటు కి స్వీటీ' చిత్రంలోని 'బామ్ డిగ్గీ డిగ్గీ' పాటకు వారిద్దరూ కలిసి డాన్స్ చేశారు. సూపర్ హిట్ సాధించిన ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, సన్నీ సింగ్, నుష్రత్ భారుచా ప్రధాన పాత్రధారులు.

Adah Sharma
Bom Diggy Diggy' song
Sonu Ke Titu Ki Sweety
Instagram
  • Loading...

More Telugu News