Cricket: క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం... ఇక స్మిత్, వార్నర్ బ్యాటింగ్ చూసేది అసాధ్యమే!
- వారిద్దరి కథా ముగిసినట్టే
- ఆస్ట్రేలియా వార్తా సంస్థల కథనాలు
- జీవితకాల నిషేధంపై నేడో, రేపో నిర్ణయం
సమకాలీన క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ల కెరీర్ ఇక ముగిసినట్టేనా? అవుననే అంటున్నాయి ఆస్ట్రేలియా మీడియా సంస్థలు. క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం, ఆటలో ఏ విధమైన మోసం చేసినా జీవితకాల నిషేధాన్ని అనుభవించాల్సిందే. తాము బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డామని చెప్పడంతో పాటు, ఆ పని తెలిసే చేశామని, అది డ్రస్సింగ్ రూమ్ నిర్ణయమని మీడియా ముందు అంగీకరించిన స్మిత్, వార్నర్ లపై జీవితకాల నిషేధం తప్పదని, ఈ మేరకు నేడో, రేపో సంచలన నిర్ణయం వెలువడుతుందని సమాచారం. ఇక బాల్ ట్యాంపరింగ్ తప్పని తెలిసి కూడా అనుమతించిన కోచ్ డారెన్ లీమన్ పైనా చర్యలు తప్పవని తెలుస్తోంది. ఆస్ట్రేలియా క్రికెట్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, వారిద్దరూ ఇక బ్యాటింగ్ చేసేది అసాధ్యమేనని తెలుస్తోంది. దీంతో ఐపీఎల్ లో వారిని కొనుగోలు చేసిన ఫ్రాంచైజీలపైనా ప్రభావం పడనుంది.