jio prime: 31తో ముగియనున్న జియో ప్రైమ్ సభ్యత్వం... తర్వాత ఏంటి?

  • రెన్యువల్ కు అవకాశం ఇస్తుందా?
  • లేక కొత్త పథకాన్ని తీసుకొస్తుందా..?
  • 31లోపే కంపెనీ ప్రకటన చేయవచ్చని విశ్లేషకుల అంచనా

రిలయన్స్ జియో కస్టమర్ల ప్రైమ్ సభ్యత్వం ఈ మార్చి 31తో గడువు తీరిపోతుంది. ఆ తర్వాత ఏంటన్నది ప్రస్తుతానికి ప్రశ్నగానే ఉంది. ఎందుకుంటే కంపెనీ నుంచి ఇంత వరకు రెన్యువల్ కు సంబంధించిన ప్రకటన లేదు. కొత్తగా ఏదైనా పథకాన్ని ఆఫర్ చేసేదీ స్పష్టత లేదు. సాధారణ కస్టమర్లతో పోలిస్తే అదనపు డేటా, జియో యాప్స్ ను ఉచితంగా వినియోగించుకునే వెసులుబాటుతో రూ.99కే ఏడాది కాలం పాటు ప్రైమ్ సభ్యత్వాన్ని జియో తీసుకొచ్చింది. సుమారు 10 కోట్ల మంది ప్రైమ్ సభ్యత్వం తీసుకుని ఉన్నారు. జియోకు ఉన్న కస్టమర్లు 16 కోట్ల మంది. ఇందులో ఎక్కువ మంది ప్రైమ్ మెంబర్లుగా ఉన్నందున సభ్యత్వం కొనసాగింపుపై త్వరలోనే ప్రకటన వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కస్టమర్లను కట్టిపడేసే పథకాలను ప్రకటించడం జియోకు అలవాటే కనుక ప్రైమ్ సభ్యత్వానికి సంబంధించి కొత్తగా ప్లాన్ ను ప్రకటించొచ్చని లేదా, రూ.99కి మరో ఏడాది రెన్యువల్ కు అవకాశం ఇవ్వొచ్చన్న అంచనా విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.

jio prime
  • Loading...

More Telugu News