Telugudesam MP N.Sivaprasad: ఏప్రిల్ 6న శపించనున్న టీడీపీ ఎంపీ శివప్రసాద్....!

  • ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మూడు వారాలుగా పలు గెటప్‌లలో దర్శనమిస్తున్న టీడీపీ చిత్తూరు ఎంపీ
  • ఏప్రిల్ 6న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ముగింపు రోజున విశ్వామిత్రుడి వేషధారణ
  • తమ డిమాండ్ వ్యక్తీకరణకు ఇదో మార్గమని వెల్లడి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎంపీ ఎన్.శివప్రసాద్ మూడు వారాలుగా భిన్నమైన గెటప్‌లలో దర్శనమిస్తూ వస్తున్నారు. బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 6న ముగియనున్నాయి. ఇప్పటివరకు గృహిణి, సత్యహరిశ్చంద్రుడు లాంటి పలు వేషాల్లో దర్శనమిచ్చిన ఆయన సమావేశాల ఆఖరి రోజున విశ్వామిత్ర మహర్షిగా రానున్నారు. సప్తరుషుల్లో విశ్వామిత్రుడు ఒకరు.

ఆయన శాపానికి తిరుగుండదని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి పవర్ ఫుల్ వేషధారణతో శివప్రసాద్ దర్శనమివ్వబోతున్నారు. "వాస్తవంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని శపించదలచుకోలేదు. మా బాధను వ్యక్తం చేయడానికి ఇది మరో మార్గం. అయ్యా...మమ్మల్ని ఆదుకోండి. లేదంటే...(పరోక్షంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్న నర్మగర్భ సంకేతమిస్తూ)" అని ఆయన అన్నారు.

Telugudesam MP N.Sivaprasad
Viswamitra
Parliament
Budget session
  • Loading...

More Telugu News