Mukesh Ambani: సిద్ధి వినాయక ఆలయంలో ఆకాష్, శ్లోక సందడి!

- గోవాలో ఆకాశ్, శ్లోకల నిశ్చితార్థం
- తల్లిదండ్రులతో కలసి వినాయకుని దర్శనం
- ప్రత్యేక పూజలు చేయించిన అర్చకులు
గోవాలో నిశ్చితార్థం జరుపుకున్న ముఖేష్, నీతా అంబానీల కుమారుడు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాలు ముంబైలోని సుప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకున్నారు. వీరి వెంట ముఖేష్ కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. ప్రముఖ వజ్రాల వ్యపారి రుసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాతో ఆకాష్ నిశ్చితార్థం గోవాలో బంధుమిత్రుల మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలోని దీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో కలసి చదువుకున్న వీరిద్దరూ చిన్ననాటి నుంచి స్నేహితులు కాగా, ఇంటర్ తరువాత ప్రేమలో పడగా, వారి ప్రేమను ఇరు కుటుంబాలూ ఆశీర్వదించాయి.
