Chiranjeevi: కొడుక్కి మరపురాని గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్!
- రేపు రామ్ చరణ్ పుట్టిన రోజు
- గడియారాన్ని బహుమతిగా ఇచ్చిన చిరంజీవి
- వైరల్ అవుతున్న ఫోటో
రేపు మంగళవారం నాడు పుట్టినరోజు జరుపుకోనున్న తన కుమారుడు రామ్ చరణ్ కు మెగాస్టార్ చిరంజీవి మరపురాని బహుమతిని అందించారు. తనయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన ఆయన, ఓ గడియారాన్ని కుమారుడికి గిఫ్ట్ గా ఇచ్చినట్టు తెలుస్తోంది. "ముందుగా టైమ్ లెస్ గిఫ్ట్ ఇచ్చిన అమ్మానాన్నలకు ధన్యవాదాలు" అంటూ మెగాస్టార్ చిరంజీవి అనే హ్యాష్ ట్యాగ్ ను తగిలించిన పోస్టును తన ఫేస్ బుక్ ఖాతాలో రామ్ చరణ్ పోస్టు చేశాడు. ఈ ఫోటోలో చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ కూడా కనిపిస్తున్నారు. కాగా, రామ్ చరణ్ హీరోగా నటించిన 'రంగస్థలం' ఈ వారంలో విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ పోస్టు చేసిన ఈ చిత్రం ఇప్పుడు వైరల్ అవుతుండగా, మెగా ఫ్యాన్స్ ఆయనకు అడ్వాన్డ్స్ విషస్ చెబుతున్నారు.
<iframe src="https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2FAlwaysRamCharan%2Fposts%2F997957197019333&width=500" width="500" height="626" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true"></iframe>