Pawan Kalyan: పవన్ కల్యాణ్... ఆ ఒక్క మాటను ఎన్నడూ అనవద్దు: హీరో నితిన్

  • 'తొలిప్రేమ' చూసి హీరో అవ్వాలని డిసైడ్ అయ్యాను
  • ఇంకెప్పుడూ సినిమాలు చేయనని చెప్పవద్దు
  • పవన్ కల్యాణ్ కు నితిన్ విన్నపం

పవన్ కల్యాణ్ నటించిన 'తొలిప్రేమ' సినిమా చూసిన తరువాత హీరో అవ్వాలని డిసైడ్ అయి పోయానని హీరో నితిన్ వ్యాఖ్యానించాడు. నితిన్ నటించిన 'ఛల్ మోహన్ రంగ' సినిమా విడుదలకు సిద్ధమైన సందర్భంగా, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో పాల్గొన్న నితిన్ మాట్లాడుతూ, పవన్ సినిమా వస్తే, ఆర్టీసీ క్రాస్ రోడ్డులో బ్యానర్లు కట్టి, బట్టలు చింపుకుంటూ డ్యాన్సులు వేసి, థియేటర్లలో పేపర్లు ఎగరేశానని గుర్తు చేసుకున్నాడు. అటువంటి పవన్ తన సినిమాకు నిర్మాత కావడం తనకెంతో ఆనందంగా ఉందని, అభిమానుల తరఫున పవన్ కు ఓ చిన్న రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్పిన ఆయన, "పవన్ కల్యాణ్ ఏ ఫీల్డ్ కు వెళ్లినా సక్సెస్ అవుతారు.

 కానీ, మీ నోటివెంట సినిమాలు చేయను, మానేస్తున్నాను అని మాత్రం అనవద్దు. ఫ్యాన్స్ గా మేము తట్టుకోలేము" అని చెప్పాడు. ఒకవేళ సినిమాలు చేయకూడదని అనుకున్నా, ఆ మాట చెప్పవద్దని, అభిమానులుగా తాము ఎప్పుడైనా ఓ సినిమా చేస్తారులే అన్న హోప్ తో ఉంటామని అన్నాడు. కాగా, 'ఛల్ మోహన్ రంగ' చిత్రం ఏప్రిల్ 5న విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.

Pawan Kalyan
Nitin
Chal Mohan Ranga
Pre Release Event
  • Loading...

More Telugu News