Actor: ప్రత్యేక హోదాకు ఇంకా ఏడాది సమయం ఉంది.. తొందరెందుకు?: సినీ నటుడు సుమన్

  • సమయం ఉండగా దాడి ఎందుకు?
  • అప్పుడు కూడా ఇవ్వకుంటే ప్రశ్నించాలి
  • ప్రతిపక్షాలకు సుమన్ హితవు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలంటూ జరుగుతున్న ఉద్యమంపై ప్రముఖ సినీ నటుడు సుమన్ స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఇంకా ఏడాది సమయం ఉందని, ఎందుకు తొందరపడుతున్నారని ప్రశ్నించారు. కేంద్రం ఇస్తానన్న దానికి ఇంకా సంవత్సర సమయం ఉండడంతో ఇప్పటి నుంచే తొందరపడడం అర్థం లేని చర్య అన్నారు. సమయం ఉండగానే నలుగురు కలిసి నాలుగు వైపుల నుంచి విమర్శలు చేస్తుండడం సరికాదన్నారు. ఏడాది తర్వాత కూడా ఇవ్వకుంటే అప్పుడు ప్రశ్నించాలని సుమన్ హితవు పలికారు.

ఆదివారం నెల్లూరులోని పురమందిరంలో సింహపురి సంస్కృతి సమాఖ్య ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన సుమన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానిస్తే టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రటించారు.

Actor
Suman
Tollywood
Special Category Status
Andhra Pradesh
  • Loading...

More Telugu News