Salman Khan: 'పూజ'ను ఆదుకుంటాం... సల్మాన్ ఖాన్ ప్రకటన

  • క్షయ వ్యాధితో బాధపడుతున్న 'వీర్‌ఘటి' చిత్ర నటి పూజ దడ్వాల్
  • ఆమెను ఆదుకుంటానని హీరో సల్మాన్ ప్రకటన
  • ప్రస్తుతం ముంబైలోని టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పూజ

క్షయ వ్యాధితో గత ఆరు నెలలుగా బాధపడుతున్న 'వీర్ ఘటి' హీరోయిన్ పూజ దడ్వాల్‌ని ఆదుకుంటానని ఆ సినిమాలో హీరోగా చేసిన బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తెలిపాడు. 1995లో విడుదలయిన ఆ చిత్రంలో ఆమె సల్మాన్ సహ నటిగా నటించింది. అందులో అతుల్ అగ్నిహోత్రికి జంటగా ఆమె యాక్ట్ చేసింది. ఆమె తన దయనీయ పరిస్థితి గురించి మీడియా ముఖంగా తెలిపింది. దీనిపై తొలుత స్పందించిన బోజ్‌పురి స్టార్ రవి కిషన్ ఆమెకు తనవంతు సాయం చేశాడు.

1997లో విడుదలయిన 'తుమ్ సే ప్యార్ హో గయా' చిత్రంలో ఆమె రవికిషన్‌తో కలిసి నటించింది. కాగా, ఇటీవల పూణేలో సల్మాన్ చేపట్టిన 'దబాంగ్' టూర్ సందర్భంగా అతని వద్ద పూజా పరిస్థితిని మీడియా ప్రస్తావించినప్పుడు, "పూజ గురించి నాకు ఇప్పుడే తెలిసింది. ఆమె ఇలాంటి దుస్థితిలో ఉందని నాకు ఇప్పటివరకు తెలియదు. ఆమెకు చేయగలిగినంత సాయం చేస్తాం. ఆమె కోలుకుంటుందని ఆశిస్తున్నాను" అని సల్మాన్ చెప్పాడు. పూజ ప్రస్తుతం ముంబైలోని టీఆర్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది.

Salman Khan
Puja Dadwal
Veergati
Ravi Kishan
  • Loading...

More Telugu News