Telangana: జిమ్నాస్టిక్స్ కోచ్ బ్రిజ్ కిశోర్ కు రూ.25 లక్షల చెక్కు అందజేత

  • ‘బసవతారకం’ ఆసుపత్రిలో బ్రిజ్ కిశోర్ ను పరామర్శించిన మంత్రి పద్మారావు
  • బ్రిజ్ కిశోర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా
  • జిమ్నాస్టిక్స్ లో ఆయన చేసిన సేవలకు చెక్కు అందజేసిన మంత్రి

కొన్ని రోజులుగా బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జిమ్నాస్టిక్స్ కోచ్ బ్రిజ్ కిశోర్ ను మంత్రి పద్మారావు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. జిమ్నాస్టిక్స్ లో ఆయన అందించిన సేవలకు గాను తెలంగాణ ప్రభుత్వం తరపున రూ.25 లక్షల చెక్ ను అందజేశారు. పద్మారావు వెంట స్పోర్ట్స్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉన్నారు. కాగా, ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ కప్ జిమ్నాస్టిక్స్ లో భారత్ కు తొలిపతకం అందించిన క్రీడాకారిణి అరుణారెడ్డికి బ్రిజ్ కిశోర్ కోచ్ గా వ్యవహరించారు. ఈ పోటీల్లో అరుణారెడ్డి కాంస్య పతకం సాధించారు.  

Telangana
coach briz kishore
minister padmarao
  • Loading...

More Telugu News