Instagram: మంచు లక్ష్మి, బ్రాహ్మణిలతో మహేశ్, చరణ్ భార్యలు...!

  • నమ్రత, బ్రాహ్మణి, మంచు లక్ష్మిలతో దిగిన ఫొటోని అప్ లోడ్ చేసిన ఉపాసన
  • చంద్రబాబు మనవడు దేవాన్ష్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు
  • వైరల్‌గా మారిన ఫొటో..నెటిజన్ల లైక్‌లు..కామెంట్లు...

ఏపీ సీఎం నారాచంద్రబాబు నాయుడు కోడలు బ్రాహ్మణి, విలక్షణ నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీలతో కలిసి సూపర్ స్టార్ మహేశ్‌బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యలు నమ్రతా శిరోద్కర్, ఉపాసనా కొణిదెల దిగిన ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ ఫొటోని ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీనికి నెటిజన్లు తెగ లైక్‌లు కొట్టడమే కాకుండా సూపర్, నైస్... అంటూ కామెంట్ల రూపంలో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. లోకేశ్-బ్రాహ్మణి కుమారుడు దేవాన్ష్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఉపాసన ఈ ఫొటోని పోస్ట్ చేసింది. 

Instagram
Manchu Laxmi
Upasana
Ramcharan
Mahesh Babu
Brahmani
Chandrababu
  • Loading...

More Telugu News