Ileana: భర్తకు కాంప్లిమెంట్ ఇచ్చిన ఇలియానా!

  • జ్వరంతో బాధపడుతున్న ఇలియానా
  • దగ్గరుండి చూసుకుంటున్నారంటూ భర్తకు కితాబు
  • ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో అప్‌లోడ్

బాలీవుడ్‌ సినిమా 'రైడ్'తో హిట్ కొట్టిన గోవా భామ ఇలియానా తన భర్త ఆండ్రూ నీబోన్ 'బెస్ట్' అంటూ కితాబిస్తోంది. కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్న తనకు ఆయనే దగ్గరుండి వంటలు చేసి పెడుతున్నాడని చెబుతోంది. "ఆరోగ్యం బాగాలేనప్పుడు మా ఆయనే దగ్గరుండి నన్ను చూసుకుంటారు. మా ఆయన బెస్ట్" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది.

అంతేకాక ఆండ్రూ వంటకు సంబంధించి ఓ ఫొటోని కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆస్ట్రేలియాకి చెందిన ఫొటోగ్రాఫర్ అయిన ఆండ్రూని ఇలియానా గతేడాది అక్కడే రహస్యంగా వివాహం చేసుకుంది. కుటుంబసభ్యుల సమక్షంలో ఈ తంతు జరిగిపోయినట్లు సమాచారం. అయితే ఆమె ఎప్పుడూ ఈ విషయాన్ని బహిరంగంగా ఎనౌన్స్ చేయలేదు.

Ileana
Andreu Neboni
Instagram
  • Loading...

More Telugu News