venkatesh: వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ టైటిల్ ఇదే!

  • వెంకీ, వరుణ్ మల్టీ స్టారర్ కు 'ఎఫ్ 2' టైటిల్ ఖరారు
  • జూలైలో షూటింగ్ ప్రారంభం
  • త్వరలోనే నటీనటుల వివరాలు తెలియజేస్తామన్న యూనిట్ సభ్యులు

విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తెలుగు సినీ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో వెంకటేష్. 'ఫిదా', 'తొలి ప్రేమ' చిత్రాలతో వరుస విజయాలతో మాంచి ఊపుమీదున్న యంగ్ హీరో వరుణ్ తేజ్. ఇప్పుడు వీరిద్దరూ కలసి ఓ మల్టీ స్టారర్ లో కనువిందు చేయబోతున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు 'ఎఫ్ 2' అనే టైటిల్ ను ఖరారు చేశారు. దీనికి ఉపశీర్షిక 'ఫన్ అండ్ ఫ్రస్టేషన్'. జూలై నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతోంది. త్వరలోనే ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను వెల్లడిస్తామని యూనిట్ సభ్యులు తెలిపారు. 

venkatesh
varun tej
Dil Raju
anil ravipudi
f2
tollywood
  • Loading...

More Telugu News