Chandrababu: సంక్షోభాలను ఎదుర్కొని విజయం ఎలా సాధించాలో శ్రీరాముడు నిరూపించాడు: చంద్రబాబు

  • శ్రీరామచంద్రుడు ఆదర్శనీయుడు
  • ఉత్తమ సంప్రదాయాలను రామాయణం బోధిస్తుంది
  • ఒంటిమిట్టలో 30న సీతారాముల కల్యాణం

ఏపీ ప్రజలకు, దేశవిదేశాల్లోని తెలుగువారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీరామచంద్రుడు ఆదర్శనీయుడని, సుపరిపాలనకు ఆద్యుడని చెప్పారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని వీడలేదని తెలిపారు. సమస్యల నుంచి పారిపోకుండా, సంక్షోభాలను ఎదుర్కొని, విజయాలు ఎలా సాధించవచ్చో రాముడు నిరూపించాడని చెప్పారు.

తల్లిదండ్రులను గౌరవించే ఉత్తమ సంప్రదాయాలను రామాయణం బోధిస్తుందని తెలిపారు. శ్రీరాముని కాలంలో ధర్మం నాలుగు పాదాలా నడిచిందని, నెలకు మూడు వర్షాలు కురిశాయని ఇతిహాస కావ్యాలు చెబుతున్నాయని చెప్పారు. శ్రీరామనవమి వేడుకలను కడప జిల్లా ఒంటిమిట్టలో ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని... ఈ నెల 30వ తేదీన కల్యాణం జరుగుతుందని తెలిపారు.

Chandrababu
sreerama navami
ontimitta
  • Loading...

More Telugu News