day temparatures: అప్రమత్తంగా ఉండండి: ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిక
- తెలుగు రాష్ట్రాల్లో బెంబేలెత్తిస్తున్న భానుడు
- పలు చోట్ల 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
- ఏపీలోని ఐదు జిల్లాలో ఈరోజు వడగాలులు వీయవచ్చు
ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెల ఇంకా రాకముందే ఇరు తెలుగు రాష్ట్రాలను ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఈరోజు ఏపీలోని ఐదు జిల్లాలలో వడగాలులు వీయవచ్చని చెప్పారు. గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం, కడప, కర్నూలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని తెలిపారు. అవసరమైతే తప్ప ప్రజలు ఎండలో బయటకు వెళ్లవద్దని, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లినా, తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.