Rajinikanth: సూపర్ స్టార్ రజనీ చదివిన స్కూల్‌కు ఆధునిక హంగులు!
- దక్షిణ బెంగళూరులోని రజనీ చదివిన స్కూల్‌కు మరమ్మతులు
- 1954-59 మధ్యకాలంలో ఆ స్కూల్‌లో సూపర్ స్టార్ విద్యాభ్యాసం
- మరమ్మతులకు దాదాపు రూ.1.5 కోట్ల వ్యయం...రేపటి నుంచి క్లాసులు ప్రారంభం
సూపర్ స్టార్ రజనీకాంత్ చదువుకున్న దక్షిణ బెంగళూరులోని గవిపురకి సమీపంలో నిర్మించిన ప్రభుత్వ మోడల్ ప్రైమరీ స్కూల్‌కి ఆధునిక వసతులు కల్పించారు. శివాజీ రావ్ గైక్వాడ్‌గా సూపర్ స్టార్ రజనీ ఈ స్కూల్‌లో 1954-59 మధ్యకాలంలో చదివారు. 1943లో నిర్మించిన ఈ స్కూల్ శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ, ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోలేదు. ఎట్టకేలకు కర్ణాటక ప్రభుత్వం చొరవతో ఇది ఆధునిక హంగులను సంతరించుకుంది.
దీని నిర్మాణానికి ప్రభుత్వం రూ.81.4 లక్షలు కేటాయించింది. మిగిలిన వ్యయాన్ని ఎంపీ, ఎంఎల్ఏ నిధుల నుంచి కేటాయించారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు రూ.1.5 కోట్లు. 15 తరగతి గదుల సామర్థ్యమున్న ఈ పాఠశాల రేపటి నుంచి మొదలుకానుంది. ఇందులో ఆకర్షణీయమైన ఆట మైదానం, స్మార్ట్ బోర్డులు, విద్యార్థుల కోసం ఆడియో-విజువల్ ల్యాబ్ సదుపాయం సహా పలు ఆధునిక సదుపాయాలున్నాయి.