shakeela: నేను సినిమాల్లోకి రావడానికి కారణం ఇదే!: షకీల

  • డబ్బు కోసమే సినిమాల్లోకి వచ్చా
  • కుటుంబ కష్టాలను తీర్చేందుకే నటినయ్యా
  • 23 నెలలుగా ఇంటి అద్దె కూడా చెల్లించని పరిస్థితి ఉండేది

కేవలం డబ్బు సంపాదించేందుకే సినిమాల్లోకి వచ్చానని శృంగార తార షకీలా అన్నారు. ఉన్నది ఉన్నట్టుగానే చెబుతున్నానని... తన కుటుంబం కోసమే నటినయ్యానని... కావాల్సినంత సంపాదించానని ఆమె తెలిపారు. తనకు ముగ్గురు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు, ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారని చెప్పారు. వీరిలో ఒక అక్క చిన్నప్పుడే చనిపోయిందని తెలిపారు.

తమది చాలా పెద్ద ఫ్యామిలీ అని... ఓ అక్క పెళ్లి చేసుకున్నాక కూడా తమ ఇంట్లోనే ఉండేదని చెప్పారు. ఒక అన్నేమో డ్రగ్ అడిక్ట్ అని... తమ్ముడు పదో తరగతి ఫెయిల్ అయ్యాడని... ఎవరూ కూడా జీవితంలో సరిగా సెటిల్ అయ్యే పరిస్థితే లేదని తెలిపారు. తమ కుటుంబ కష్టాలను పోగొట్టేందుకే తాను సినిమాల్లోకి వచ్చానని వెల్లడించారు. తాను తొలి పారితోషికం అందుకునే సమయానికి ఇంటి అద్దె కట్టి 23 నెలలు అయిందని చెప్పారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News