Cricket: 2019 వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే జట్లు ఇవే.. ఈసారి గ్రూపుల్లేవ్!

  • మహా సంగ్రామంలో తలపడనున్న పది జట్లు
  • ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌ నుంచి విండీస్, ఆఫ్ఘాన్ జట్లు
  • వచ్చే ఏడాది మే 30న ఫైనల్స్

వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ సమరంలో ఏయే జట్లు ఆడేది తేలిపోయింది. మొత్తం పది జట్లు వన్డే యుద్ధంలో పాల్గొననుండగా ఎనిమిది జట్లు ఇది వరకే అర్హత సాధించాయి. గతేడాది సెప్టెంబరులో ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ ఆధారంగా ఎనిమిది జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత పొందాయి. వీటిలో ఆతిథ్య ఇంగ్లండ్, ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు ఉన్నాయి. మిగతా రెండు జట్ల కోసం నిర్వహించిన ప్రపంచకప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు ఆడిన జట్లలో వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్‌లు ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి.

ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్ జట్టు ప్రపంచకప్ క్వాలిఫయర్స్ మ్యాచుల్లో సూపర్ సిక్స్‌లో స్కాట్లాండ్‌ను ఓడించడం ద్వారా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఇక వరుసగా తొలి మూడు మ్యాచుల్లోనూ ఓడిపోయిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. యువ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్ మాయాజాలంతో సూపర్ సిక్స్‌లోకి ప్రవేశించి ఐర్లండ్‌ను ఓడించి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఈసారి ప్రపంచకప్‌లో ఒకటే గ్రూప్ ఉండనుంది. ఒక్కో జట్టు మిగతా తొమ్మిది జట్లతో ఆడనుంది. ఇందులో టాప్ ఫోర్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. 30 మే 2019న ఫైనల్ జరగనుంది.

Cricket
World cup
England
  • Loading...

More Telugu News