Chandrababu: ఈ కారణం వల్లే సుజనాపై దుష్ప్రచారం చేస్తున్నారు: చంద్రబాబు

  • పీఎంవోలో మీడియాను చూసి విజయసాయి ఎందుకు దాక్కున్నారు?
  • ప్రజల దృష్టిని మరల్చేందుకే సుజనాపై విమర్శలు చేస్తున్నారు
  • నిజాయతీగా ఉన్న మాపైనే విమర్శలు చేస్తారా?

బీజేపీతో తిరిగి సయోధ్య కుదుర్చుకోవడం కోసం టీడీపీ యత్నిస్తోందనే కథనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కొట్టివేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతో తిరిగి జతకట్టడం అసంభవమని అన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రధాని కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న అంశం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సుజనా చౌదరిపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కేంద్ర మంత్రులతో సుజనా భేటీ అవుతున్నారనే అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

ప్రజల తరపున నిజాయతీతో పోరాటం చేస్తున్నామని మీకు కంటగింపుగా ఉందా? అంటూ వైసీపీపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న మాపైనే ఆరోపణలు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎంవోలో మీడియా కంట పడకుండా విజయసాయిరెడ్డి ఎందుకు దాక్కున్నారని ప్రశ్నించారు. వైసీపీలా తమకు లాలూచీ రాజకీయాలు తెలియవని చెప్పారు. కేసులు మాఫీ చేయించుకునే అవసరం మీకుంది కానీ, మాకు లేదని అన్నారు.

Chandrababu
Sujana Chowdary
YSRCP
Vijay Sai Reddy
cases
pmo
  • Loading...

More Telugu News