somu veerraju: చంద్రబాబు సీఎంగా ఉన్నంత వరకు ప్రత్యేక హోదా రాకపోవచ్చు: సోము వీర్రాజు

  • రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతే
  • ప్రాజెక్టులు అవినీతికి నిలయంగా మారాయి
  • బాబును కేంద్రం నమ్మడం లేదు

ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నంత వరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉండకపోవచ్చని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతే దీనికి కారణమని ఆయన చెప్పారు. మట్టి నుంచి ఇసుక దాకా, పోలవరం నుంచి పట్టిసీమ దాకా ఎక్కడ చూసినా లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు రాష్ట్రాన్ని బలి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ అవినీతికి నిలయంగా మారాయని చెప్పారు. ఈ అవినీతి నేపథ్యంలో, చంద్రబాబును కేంద్రం నమ్మే పరిస్థితి లేదని ఆయన తెలిపారు. అవినీతిపై విచారణ జరగాల్సిందే అని డిమాండ్ చేశారు.

somu veerraju
Chandrababu
Special Category Status
corruption
  • Loading...

More Telugu News