prakash karat: వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి గట్టి ప్రయత్నం చేస్తాం: సీపీఎం అగ్ర నేత ప్రకాశ్ కారత్

  • ఇటీవల వెలువడ్డ యూపీ ఉప ఎన్నికల ఫలితాలు మంచి పాఠం నేర్పాయి 
  • బీజేపీని ఓడించేందుకు ఎన్నికల వ్యూహాలను అందించాయి
  • బీజేపీని ఓడించగలిగే అవకాశం ఉన్న చోట కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తాం

ఎట్టి పరిస్థితులలోనైనా బీజేపీని ఓడించేందుకు తాము గట్టి ప్రయత్నం చేస్తామని సీపీఎం అగ్ర నేత ప్రకాశ్ కారత్ తెలిపారు. ఇటీవల వెలువడ్డ ఉప ఎన్నికల ఫలితాలు తమకు మంచి పాఠం నేర్పాయని, బీజేపీని కాంగ్రెస్ ఓడించగలిగే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో తాము కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని ప్రకటించారు. బీజేపీని ఓడించేందుకు ఎన్నికల వ్యూహాలకు సంబంధించి మంచి పాఠాలను ఆ ఉప ఎన్నికలు తమకు అందించాయని, బీజేపీయేతర పార్టీల్లో ముఖ్యమైన పార్టీలన్నీ కలిస్తే మిగతా చిన్న పార్టీలు కూడా మద్దతు ప్రకటిస్తాయని అభిప్రాయపడ్డారు.

prakash karat
cpi
BJP
  • Loading...

More Telugu News