Anuska sarma: సెలబ్రిటీ హోదాలో.. టాప్ హీరోయిన్లను పక్కకు నెట్టేసిన అనుష్క శర్మ!

  • సోషల్ మీడియాలో అత్యంత ప్రభావశీల తారగా అవతరించిన అనుష్క శర్మ
  • రెండు, మూడు స్థానాల్లో ప్రియాంక, దీపికా పదుకునే
  • సర్వే చేసి సెలబ్రిటీలకు ర్యాంకులు కేటాయించిన 'స్కోర్ ట్రెండ్స్' సంస్థ

సోషల్ మీడియాలో బాలీవుడ్ టాప్ హీరోయిన్లు దీపికా పదుకునే, ప్రియాంకా చోప్రాలను సైతం ముద్దుగుమ్మ అనుష్క శర్మ పక్కకు నెట్టేసిందని 'స్కోర్ ట్రెండ్స్' సంస్థ తాజా సర్వే వెల్లడించింది. సోషల్ మీడియాలో ఆమె అత్యంత ప్రభావశీల తారగా అవతరించింది. సోషల్ మీడియా, వార్తాపత్రికలు లాంటి ఇతర ప్రసార మాధ్యమాల్లో ఉనికి ఆధారంగా ఈ సర్వే సంస్థ సెలబ్రిటీలకు ర్యాంకులు కేటాయించింది. ఫేస్‌బుక్, ట్విట్టర్‌తో పాటు భారతదేశంలోని 14 భాషలలో వార్తాపత్రికలు, ప్రసార, డిజిటల్ వేదికల నుంచి ఈ డేటాని సేకరించినట్లు స్కోర్ ట్రెండ్స్ తెలిపింది.

ఈ డేటా ప్రకారం, అనుష్క శర్మ ఇతర సెలబ్రిటీల కంటే మెండుగా 71.90 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. 50.43 స్కోరుతో ప్రియాంకా చోప్రా రెండో స్థానంలోనూ, 40.09 స్కోరుతో దీపికా పదుకునే మూడో స్థానంలోనూ, 31.78 స్కోరుతో కంగనా రనౌత్ నాలుగో స్థానంలోనూ నిలిచారు. ఈ గణాంకాలు కచ్చితమైనవని సర్వే సంస్థ సహ వ్యవస్థాపకులు అశ్విని కౌల్ చెప్పారు. టాప్-10 సెలబ్రిటీల్లో చోటు దక్కించుకున్న ఇతర బాలీవుడ్‌ స్టార్లలో సన్నీ లియోన్, సోనం కపూర్, శ్రద్ధా కపూర్, విద్యాబాలన్, తాప్సీ పన్ను, మాధురీ దీక్షిత్ ఉన్నారు.

Anuska sarma
Priyanka chopra
Sunny Leone
madhuri dixit
Deepika Padukone
Score Trends
Twitter
Facebook
  • Loading...

More Telugu News