Nayanatara: తన కాబోయే భర్త ఎవరో చెప్పేసిన నయనతార!

  • నటనా రంగంలో 'ఎక్స్‌లెన్స్' అవార్డును అందుకున్న లేడీ సూపర్‌స్టార్ 
  • తల్లిదండ్రులు, సోదరుడు, కాబోయే భర్తకు కృతజ్ఞతలు చెప్పిన మలయాళ కుట్టి
  • చెన్నైలో ఘనంగా 'ది హిందూ' ఆంగ్ల దినపత్రిక 'వరల్డ్ ఆఫ్ ఉమెన్-2018' అవార్డుల ప్రదానోత్సవం

'ది హిందూ' ఆంగ్ల దినపత్రిక నిన్న చెన్నైలో నిర్వహించిన 'వరల్డ్ ఆఫ్ ఉమెన్-2018' అవార్డుల ప్రదానోత్సవంలో హీరోయిన్ నయనతార తనకు కాబోయే భర్త ఎవరో చెప్పేసింది. ఈ సందర్భంగా నటనా రంగంలో ఎక్స్‌లెన్స్ అవార్డును అందుకున్న ఈ మలయాళ కుట్టి... తన తల్లిదండ్రులకు, సోదరుడికి కృతజ్ఞతలు తెలిపింది.

అంతేకాక తనకు కాబోయే భర్త (విఘ్నేశ్‌ పేరు ప్రస్తావిస్తూ)కి కూడా కృతజ్ఞతలు తెలిపింది. దీంతో ఇంతకాలంగా నయనతార పెళ్లి చేసుకోబోయేది విఘ్నేశ్‌నా? కాదా? అన్న డౌటు పటాపంచలైపోయింది. 'నానుమ్ రౌడీ ధాన్ (తెలుగులో నేనూ రౌడీనే)' చిత్రం షూటింగ్ సందర్భంగా విఘ్నేశ్-నయన్ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి చివరకు పెళ్లిపీటల వరకు వెళ్లబోతోంది. కాగా, నయనతార ప్రస్తుతం చిరంజీవి 'సైరా' చిత్రంలో నటిస్తోంది. ఇక ఆమె నటించిన 'కర్తవ్యం' చిత్రం విడుదలకు రెడీ అవుతోంది.

Nayanatara
Vignesh
The Hindu
World of Women 2018
  • Loading...

More Telugu News