Vijay Sai Reddy: విజయసాయిరెడ్డి ఆర్థిక నేరస్తుడు : ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ

  • విజయసాయిరెడ్డి పలు కేసుల్లో నిందితుడు
  • మోదీని విజయసాయి కలవడం కరెక్టు కాదు
  • ఈడీ, సీబీఐపై దీని ప్రభావం పడుతుంది 

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆర్థిక నేరస్తుడని టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, 11 సీబీఐ కేసులు, ఈడీ కేసుల్లో ఏ2 గా ఉన్న విజయసాయిరెడ్డి, ప్రధాని మోదీని కలిశారని, దీని ప్రభావం దర్యాప్తు సంస్థలపై పడదా? ప్రధాని కనుసన్నల్లో ఉండే సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లు ఎలా స్వేచ్ఛగా పని చేస్తాయని ప్రశ్నించారు. ప్రధానిని విజయసాయి కలిసిన తర్వాతే రెండు ఈడీ కేసుల నుంచి ఉపశమనం లభించిందని ఆయన ఆరోెపించారు.

తన గొయ్యి తానే తవ్వుకుంటున్న బీజేపీ : మాగంటి బాబు

టీడీపీ ఎంపీ మాగంటి బాబు మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ తన గొయ్యి తానే తవ్వుకుంటోందని అన్నారు. ఏపీ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు. ఏపీకి నిధులు, పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసే అవకాశం ఉందని అన్నారు.

Vijay Sai Reddy
mla bandaru
  • Loading...

More Telugu News