Kangana ranauth: నటి కంగనా రనౌత్ తన 31వ బర్త్ డేని ఎలా జరుపుకుందో తెలిస్తే మెచ్చుకోవాల్సిందే...!

  • 31వ పుట్టిన రోజు సందర్భంగా 31 మొక్కలను నాటిన బాలీవుడ్ బ్యూటీ
  • మనాలీలో కుటుంబసభ్యులు, మిత్రులతో సరదాగా కాసేపు
  • కంగన 'మణికర్ణిక' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు తమ పుట్టినరోజులను చాలా డిఫెరెంట్‌గా చేసుకుంటున్నారు. కొందరు అనాథాశ్రమాల్లోనూ మరికొందరు తమ కుటుంబసభ్యుల సమక్షంలోను సింపుల్‌గా జరుపుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటి కంగనౌ రనౌత్ కూడా నిన్న తన 31వ పుట్టిన రోజును ఆదర్శప్రాయంగా జరుపుకుంది. 31వ పడిలో అడుగిడుతున్న తరుణాన్ని పురస్కరించుకుని ఆమె గతవారం రోజుల్లో 31 మొక్కలను నాటింది.

తెలుగువాళ్లకు 'ఏక్ నిరంజన్' చిత్రం ద్వారా సుపరిచితురాలైన ఈ ముద్దుగుమ్మ పెద్దగా ఆర్భాటాలకు పోకుండా ఇంత సింపుల్‌గా తన బర్త్ డేని జరుపుకుంది. మనాలీలో తన సన్నిహిత మిత్రులు, కుటుంబసభ్యులతో ఆమె గడిపింది. కంగన సోదరి రంగోళి చందేల్ ట్విట్టర్ వేదికగా తన సోదరికి బర్త్ డే విషెస్ తెలిపింది. పుట్టినరోజు నాడు తమ లిటిల్ క్వీన్ (కంగనను ఉద్దేశించి) తనకు తానుగా ఓ ఆకుపచ్చ గోళాన్ని బహుమతిగా ఇచ్చుకుందంటూ ట్వీట్ చేసింది. కాగా, కంగన నటించిన 'మణికర్ణిక : ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' త్వరలోనే విడుదల కానుంది.

Kangana ranauth
Birth Day
Plants
Twitter
  • Loading...

More Telugu News