Narendra Modi: పవన్ పార్టీ మూసేయడానికి... చిరంజీవికి పట్టినంత సమయం కూడా అవసరం లేదు: వర్ల

  • పవన్ ను ఎవరు ఆడిస్తున్నారో అందరికీ తెలుసు
  • రాజ్యాంగాన్ని కేంద్రం అవహేళన చేస్తోంది
  • ప్రధాని మోదీ జిత్తులమారి నక్క

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. పవన్ ను వెనకుండి ఎవరు ఆడిస్తున్నారో అందరికీ తెలుసని చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని... జనసేన దుకాణం బంద్ అయిపోతుందని అన్నారు. 18 సీట్లు వచ్చాక ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి మూసేశారని... పవన్ పార్టీని మూసేయడానికి అంత సమయం కూడా పట్టదని ఎద్దేవా చేశారు.

రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం అవహేళన చేస్తోందని వర్ల రామయ్య మండిపడ్డారు. రెండు పార్టీలు ఆందోళన చేస్తున్నాయనే సాకు చూపిస్తూ, అవిశ్వాసంపై చర్చ జరపకుండా లోక్ సభను వాయిదా వేయిస్తోందని అన్నారు. ఆందోళన చేస్తున్న వారిని మార్షల్స్ సహాయంతో బయటకు పంపి, చర్చను చేపట్టవచ్చు కదా? అని అన్నారు. అవిశ్వాసంపై చర్చకు కేంద్రం భయపడుతోందని తెలిపారు. ప్రధాని మోదీ నక్కజిత్తు ఆలోచనలతో అవిశ్వాసం చర్చకు రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. 

Narendra Modi
Pawan Kalyan
varla ramaiah
Chiranjeevi
Jana Sena
praja rajyam
  • Loading...

More Telugu News