Vadodara: వడోదరాలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రియా వారియర్ ఫొటోతో చెక్...!

  • సందేశాలు రాసిన ప్రియా ప్రకాశ్ ఫొటోతో వడోదర పోలీసుల ప్రచారం
  • వడోదరా ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా పేజీల్లో పోస్టర్లు
  • పోస్టర్లతో ప్రచారం సత్ఫలితాలనిస్తున్నాయన్న నగర పోలీసు కమీషనర్

ఒక్క డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్‌తో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయిన మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్‌ పాప్యులారిటీ ఇప్పుడు వడోదరలో పనిచేయనుంది. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగర పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్ పెట్టేందుకు ఆమె 'కన్ను కొట్టుడు' ఎక్స్‌ప్రెషన్‌ను ఉపయోగించుకుంటున్నారు.

"రెప్పపాటు కాలంలోనే ప్రమాదాలు జరుగుతాయి.. పరధ్యానం లేకుండా జాగ్రత్తగా వాహనాలు నడపండి" అంటూ రాసిన పోస్టర్‌పై ప్రియా వారియర్‌ ఫొటో ఉంది. మరో పోస్టర్‌పై "కొన్నిసార్లు షేరింగ్ అనేది కేరింగ్ కాదు : మీ పాస్‌వర్డ్‌లు అసలు ఎన్నటికీ ఎవరికీ చెప్పవద్దు" అని రాసి ఉంది.

పలు రంగుల్లో రూపొందించిన ఇలాంటి సినిమా తరహా సందేశాల పోస్టర్లను వడోదర పోలీసులు తమ ట్విట్టర్, ఫేస్‌బుక్ హోమ్ పేజీల్లో పోస్టు చేసింది. ప్రియా వారియర్‌ ఫొటోతో కూడిన ఈ తరహా పోస్టర్ల రూపకల్పన వెనుక ఓ సృజనాత్మక సంస్థ ఉన్నట్లు తెలిసింది. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద నిబంధనలను ఉల్లంఘిస్తూ యువత ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో వడోదర పోలీసులు ఇలాంటి వినూత్న ప్రయత్నం చేయడం ప్రశంసనీయం. ఈ పోస్టర్లతో ప్రచారం వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని వడోదర పోలీసు కమీషనర్ మనోజ్ శశిధర్ మీడియాకి తెలిపారు.

Vadodara
Social Media
Wink
Vadodara City Police
Priya Prakash Warrior
  • Loading...

More Telugu News