Pawan Kalyan: ఏపీలో అవినీతి ‘జనసేన’ అధినేతకు ఇప్పుడు కొత్తగా కనపడుతోందా? : హీరో శివాజీ
- ప్రభుత్వ అవినీతి గురించి ఇన్నాళ్లూ ఎందుకు ప్రశ్నించలేదు?
- లోకేశ్ అవినీతి చేశారని ఇప్పుడే ఎందుకు ప్రశ్నిస్తున్నారు?
- పవన్ పై విమర్శలు గుప్పించిన శివాజీ
ఏపీలో అవినీతి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ఇప్పుడు కొత్తగా కనపడుతోందా? అని హీరో శివాజీ ప్రశ్నించారు. ‘టీవీ 5’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇసుక, మట్టి విషయంలో జరుగుతున్న అవినీతి విషయమై తాను గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
‘ప్రజల్లోకి పవన్ కల్యాణ్ ఎన్నిసార్లు వచ్చారు? రోజూ ట్వీట్లు చేసే పవన్, ప్రభుత్వ అవినీతి గురించి ఇన్నాళ్లూ ఎందుకు ప్రశ్నించలేదు? లోకేశ్ అవినీతి చేశారని ఇప్పుడే ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఎమ్మార్వో వనజాక్షిపై ఎప్పుడో దాడి జరిగితే ఇప్పుడు ప్రశ్నిస్తున్నారేంటి? కరెక్టుగా లేరు.. నిజాయతీగా లేరు. నిబద్ధతతో వ్యవహరించడం లేదు. ఏపీకి రావాల్సిన ‘యాపిల్’, చైనా కంపెనీలు రాకుండా తరలిపోయాయి. ప్రధాని మోదీ తనకు చాలా క్లోజ్ అని పవన్ చెబుతున్నారు కదా!, మోదీతో పవన్ మాట్లాడి ఏపీకి రాకుండా పోయిన ఆ కంపెనీలను ఇక్కడికి రప్పించాలి’ అని పవన్ పై విమర్శలు గుప్పించారు.