Vijayanagaram District: వివాహేతర సంబంధానికి శిక్ష.. రెండు చేతులు నరికివేత!

  • గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ధనుంజయ
  • ధనుంజయ వర్గంతో మహిళ వర్గానికి ఘర్షణ
  • ధనుంజయను ఎత్తుకెళ్లి చేతులు నరికేసిన నిందితులు

వివాహేతర సంబంధానికి శిక్షగా రెండు చేతులు నరికేసిన ఘటన విజయనగరం జిల్లా ఏజెన్సీలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి పంచాయతీ పరిధిలోని కొత్తగూడ వాసి బిడ్డిక ధనుంజయ(28) అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ధనుంజయ, మహిళ వర్గాల మధ్య ఘర్షణలున్నాయి. మహిళ వర్గానికి చెందిన పాడి శివన్నారాయణ, నరేష్‌, ప్రసాద్‌ లు గత అర్ధరాత్రి ధనుంజయపై దాడి చేసి, ఓ ఇంట్లోకి తీసుకెళ్లి చేతులు, కాళ్లు కట్టేసి, వడ్రంగి పనిలో ఉపయోగించే పరికరం (బాడిత) తో రెండు చేతులు నరికేశారు.

అనంతరం బాధితుడ్ని గ్రామ సర్పంచ్ పద్మావతి ఇంటి ముందు వదిలి వెళ్లిపోయారు. దీంతో ఆమె పోలీసులకు సమాచారమందించగా, సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ధనుంజయను పార్వతీపురం ఆసుపత్రికి, అక్కడి నుంచి వైజాగ్ కేజీహెచ్‌ కు తరలించారు. అనంతరం నిందితులను అరెస్టు చేశారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు ఉన్నాయని, దీంతోనే సంఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

Vijayanagaram District
gummalaxmipuram
agencie
extramarital affair
  • Loading...

More Telugu News