shami: షమీపై చర్యలు తీసుకునేందుకు సహకరించండి: దీదీకి హసీన్ వినతి
- మమతా బెనర్జీని కలిసిన షమీ భార్య
- తను చేసిన ఆరోపణలకు గల సాక్ష్యాలను అందజేసిన హసీన్ జహాన్
- తన భర్తపై చర్యలు తీసుకోవాలని కోరిన హసీన్ జహాన్
టీమిండియా పేసర్ మహమ్మద్ షమీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆయన భార్య హసీన్ జహాన్ కలిశారు. ఈ సందర్భంగా తన భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని సీఎంకు తెలిపారు. తనను షమీ, అతని కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. మ్యాచ్ ఫిక్సింగ్ కు ముడుపులు కూడా తీసుకున్నాడని ఆమె సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా ఆరోపణలకు సంబంధించిన వివరాలను దీదీకి అందజేశారు. తనకు మద్దతుగా నిలవాలని ఆమెను హసీన్ అభ్యర్థించారు. షమీపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, షమీపై ఆమె గృహహింస కేసు పెట్టిన సంగతి తెలిసిందే.