vidya sagar rao: మహారాష్ట్ర గవర్నర్‌ని కలిసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

- స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసిన లక్ష్మీనారాయణ
- మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్ రావుతో కాసేపు ముచ్చట
- రాజకీయాల్లోకి వస్తారంటూ ప్రచారం
స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తారంటూ ఊహాగానాలు మొదలైన విషయం తెలిసిందే. పదవీ విరమణ చేసిన నేపథ్యంలో ఆయన మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. పలు అంశాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగింది. కాగా, ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు కూడా కొందరు భావిస్తున్నారు.
