keerthi suresh: జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో సమంత

- సావిత్రి పాత్ర నా మనసుకు కనెక్ట్ అయింది
- ఈ పాత్రను ఇచ్చిన నిర్మాతలకి కృతజ్ఞతలు
- రిలీజ్ డేట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా
సావిత్రి జీవితచరిత్రగా 'మహానటి' సినిమా రూపొందుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టైటిల్ రోల్ ను కీర్తి సురేశ్ పోషించింది. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ పార్టును పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ పార్టీ చేసుకుంది. ఈ సినిమాలో 'జమున' పాత్రను సమంత చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆమె ఒక జర్నలిస్ట్ గా కనిపించనుందనే టాక్ వినిపించింది. అయితే ఈ రెండు పాత్రల్లో సమంత ఏది చేస్తుందనే విషయం అభిమానులకి సందేహాన్ని కలిగించింది. ఈ సినిమాలో సమంత 'మధురవాణి' అనే జర్నలిస్ట్ పాత్రను చేసిందనేది తాజా సమాచారం.
