Narendra Modi: హిట్లర్ లా పాలించాలని మోదీ అనుకుంటే కుదరదు: జూపూడి ప్రభాకర్

  • ఒక సీఎంకు ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు!
  • ఆర్థిక నేరగాళ్లకు మాత్రం అపాయింట్ మెంట్ ఇస్తున్నారు!
  • పీఎంఓ ఏమన్నా ఆర్థిక నేరగాళ్లు, ఉగ్రవాదులకు స్థావరమా?
  • ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి

దేశాన్ని నియంత హిట్లర్ లా పాలించాలని ప్రధాని మోదీ అనుకుంటే కుదరదని ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక ముఖ్యమంత్రికి అపాయింట్ మెంట్ ఇవ్వని ప్రధాని మోదీ, ఆర్థిక నేరగాళ్లకు ఏ విధంగా అపాయింట్ మెంట్ ఇస్తున్నారు? ప్రధాన మంత్రి తరపున విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారు! ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఏమన్నా ఆర్థిక నేరగాళ్లు, ఉగ్రవాదుల స్థావరమా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తే సమాధానం ఇచ్చి తీరుతామని జూపూడి ఘాటుగా సమాధానమిచ్చారు.

Narendra Modi
jupudi prabhakar
  • Loading...

More Telugu News