Sujana Chowdary: ఏం చేయాలో మాకు తెలుసు: సుజనా చౌదరి

  • వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది
  • వైసీపీ మాపై ఆరోపణలు చేయడం, కథలు అల్లడమే పనిగా పెట్టుకుంది
  • వైసీపీ మైండ్ గేమ్ ఆడదామనుకుంటోంది

టీడీపీ ఎంపీ సుజ‌నా చౌద‌రి మ‌రోసారి కేంద్ర ప్ర‌భుత్వంపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ రోజు లోక్‌సభ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి నమస్కారం, ప్రతి నమస్కారం చేయడం తప్ప ఇంకేం చేయడానికి వీలు కుదరట్లేదని అన్నారు. తమ పార్టీ తీసుకుంటోన్న నిర్ణయాల మేరకే రాష్ట్ర ప్రయోజనాలను సాధించే క్రమంలో ఢిల్లీలో ముందుకు వెళుతున్నామని అన్నారు.

ప్రత్యేక హోదా అంశం తేలేవరకు కేంద్ర మంత్రులతో ఎటువంటి చర్చకు తాము తావు ఇవ్వడం లేదని తెలిపిన ఆయన.. వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్యాకేజీపై మాట్లాడేందుకు అరుణ్ జైట్లీ వద్దకు వెళ్లామనడం తప్పుడు ప్రచారమేనని, వైసీపీ తమపై ఆరోపణలు చేయడం, కథలు అల్లడమే పనిగా పెట్టుకుందని తెలిపారు. వైసీపీ మైండ్ గేమ్ ఆడదామని అనుకుంటోందని, తమకు ఏం చేయాలో తెలుసని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు.

Sujana Chowdary
Special Category Status
Telugudesam
  • Loading...

More Telugu News