keerti suresh: ఏఎన్నార్ పాత్రలో చైతూ .. థ్యాంక్స్ చెప్పిన 'మహానటి' నిర్మాత

  • సావిత్రి జీవితచరిత్రగా 'మహానటి'
  • రీసెంట్ గా షూటింగు పార్టు పూర్తి 
  • ఎన్టీ రామారావు పాత్రపై ఆసక్తి  

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సావిత్రి  జీవితచరిత్రగా 'మహానటి' సినిమా రూపొందింది. రీసెంట్ గా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది. సావిత్రి కెరియర్ తో ముడిపడిన పాత్రలను మంచి గుర్తింపు కలిగిన నటీనటులు చేశారు. సావిత్రితో కలిసి ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లు చాలా సినిమాల్లో నటించారు. అపురూప చిత్రాలుగా అవి నేటికీ ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటున్నాయి.

 ఇక ఈ సినిమాలో ఏఎన్నార్ పాత్రను చేయడానికి చైతూ అంగీకరించాడనీ .. ఆయనపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని ఈ మధ్య వార్తలు వచ్చాయి. అది నిజమేననే విషయాన్ని స్పష్టం చేస్తూ, ఏఎన్నార్ పాత్రను చేసిన చైతూకు నిర్మాత స్వప్న దత్ కృతజ్ఞతలు తెలియజేసింది. దాంతో .. ఎన్టీ రామారావు పాత్రను ఎవరితో చేయించారు? అనే ఆసక్తి అందరిలోను రేకెత్తుతోంది. డిజిటల్ రూపంలో ఎన్టీ రామారావును చూపించబోతున్నారా? అనే సందేహం కలుగుతోంది. 

keerti suresh
samanta
  • Loading...

More Telugu News