Nara Lokesh: విష్ణుకుమార్ రాజుకు కౌంటర్ ఇచ్చిన నారా లోకేష్

  • ఐటీ కంపెనీలకు భూముల అప్పగింతపై విష్ణు ఆరోపణలు
  • ఐటీ నిబంధనల మేరకే కేటాయింపులు జరుగుతున్నాయన్న లోకేష్
  • ఐటీ సంస్థను ఎవరు తెచ్చినా భూములిస్తామన్న మంత్రి

విశాఖపట్నం ఐటీ హబ్ కు వస్తున్న ఐటీ కంపెనీల గురించి బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు పలు ఆరోపణలు చేశారు. ఐటీ సంస్థలకు భూములను ఇస్తున్న తీరును ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో విష్ణు ఆరోపణలకు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఐటీ నింబంధనల ప్రకారమే సంస్థలకు భూములు ఇస్తున్నామని చెప్పారు.

ప్రభుత్వ విధానాలపై ఆరోపణలు చేస్తున్న వారు ఐటీ పరిశ్రమలను తీసుకొచ్చినా... 21 రోజుల్లోనే భూములు ఇస్తామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టి బయట ఉన్న పార్టీ సభ్యులు, లోపలే ఉండి విమర్శలు చేస్తున్న సభ్యులు తెలుసుకునేందుకే తాను ఈ విషయాలను చెబుతున్నానని అన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు. 

Nara Lokesh
vishnu kumar raju
it
lands
  • Loading...

More Telugu News