Lok Sabha: అవిశ్వాసంపై చర్చ జరపలేమంటూ.. మంగళవారానికి లోక్ సభను వాయిదా వేసిన స్పీకర్

  • వాయిదా తర్వాత ప్రారంభమైన లోక్ సభ
  • ఆందోళన చేపట్టిన టీఆర్ఎస్, అన్నాడీఎంకే
  • సభ ఆర్డర్ లో లేదంటూ వాయిదా వేసిన స్పీకర్

ఊహించిందే మళ్లీ జరిగింది. ఈరోజు కూడా లోక్ సభలో అవిశ్వాసంపై చర్చను చేపట్టకుండానే వాయిదా వేశారు. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే కేవలం మూడు నిమిషాల్లో సభను వాయిదా వేసిన స్పీకర్... మధ్యాహ్నం 12 గంటలకు సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత మంగళవారానికి వాయిదా వేశారు.

 అంతకు ముందు, టీడీపీ, వైసీపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ చదివి వినిపించారు. ఇదే సమయంలో టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. సీట్లలోకి వెళ్లి కూర్చోవాలని, అవిశ్వాసంపై చర్చకు సహకరించాలని స్పీకర్ పదేపదే కోరారు. అయినా గందరగోళం ఆగకపోవడంతో... సభ ఆర్డర్ లో లేదని, ఈ పరిస్థితుల్లో చర్చను చేపట్టలేమని చెబుతూ సభను వాయిదా వేశారు. 

Lok Sabha
no confidence motion
sumitra mahajan
  • Loading...

More Telugu News