Sachin Tendulkar: సచిన్ కాళ్లను పట్టుకోబోయిన వినోద్ కాంబ్లీ.. వీడియో వైరల్!

  • సచిన్, కాంబ్లీ బాల్య స్నేహితులు
  • గతంలో యాద్దరి మధ్యా కొన్నాళ్ల గ్యాప్ 
  • గతేడాది కాంబ్లీ పుట్టిన రోజు వేడుకలకు హాజరైన సచిన్

సచిన్‌ టెండూల్కర్‌-వినోద్‌ కాంబ్లీల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇప్పుడు వీరిద్దరికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబై టీ20 లీగ్ ముగింపు కార్యక్రమం సందర్భంగా అతిధులుగా వచ్చిన సచిన్, గవాస్కర్ విజేతలకు బహుమతి ప్రధానం చేశారు.

ఈ సందర్భంగా ఫైనల్ లో ఓటమి పాలైన శివాజీ పార్క్ లయన్స్ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్న కాంబ్లీ మెడల్ అందుకోవడానికి వచ్చి, సచిన్‌ పాదాలను తాకే ప్రయత్నం చేయగా, సచిన్, కాంబ్లీని గుండెలకు హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సచిన్, కాంబ్లీ బాల్య స్నేహితులన్న సంగతి తెలిసిందే. గతంలో ఒకసారి ఇద్దరి మధ్యా కాస్త గ్యాప్ ఏర్పడినప్పటికీ కాలక్రమంలో అవి సమసిపోయాయి. దీంతో గత ఏడాది కాంబ్లీ పుట్టిన రోజు వేడుకలకు సచిన్‌ హాజరయ్యాడు.

Sachin Tendulkar
vinod kambli
Cricket
120 league
mumbai
  • Error fetching data: Network response was not ok

More Telugu News