Rajya Sabha: రాజ్యసభ సోమవారానికి వాయిదా

  • ఉభయసభల్లో కొనసాగుతున్న ఆందోళనలు
  • విపక్ష సభ్యులపై వెంకయ్య ఆగ్రహం
  • లెక్క చేయని విపక్ష సభ్యులు

పార్లమెంటు ఉభయసభల్లో సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. ఇప్పటికే లోక్ సభ మధ్యాహ్నానికి వాయిదా పడగా... రాజ్యసభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే విపక్ష ఎంపీలు తమతమ సమస్యల పట్ల ఆందోళనలు చేపట్టారు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలంటూ వెంకయ్య పదేపదే కోరినప్పటికీ సభ్యులు శాంతించలేదు. ఒకానొక సమయంలో వెంకయ్య ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ప్రతి రోజూ ఇలాగే అయితే ఎలా? అంటూ ఆయన ప్రశ్నించారు. అయినప్పటికీ నిరసన కార్యక్రమాలను విపక్ష సభ్యులు కొనసాగించడంతో... సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు వెంకయ్య ప్రకటించారు.

Rajya Sabha
Venkaiah Naidu
  • Loading...

More Telugu News