Lok Sabha: ఈరోజు కూడా 'షేమ్' సీన్.. మూడు నిమిషాల్లోనే లోక్ సభ వాయిదా!

  • కొనసాగుతున్న కేంద్రం మొండి వైఖరి
  • ఆందోళన చేపట్టిన టీఆర్ఎస్, అన్నాడీఎంకే
  • ప్రారంభమైన వెంటనే లోక్ సభ వాయిదా

కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని కొనసాగిస్తూనే ఉంది. లోక్ సభ ప్రారంభమైన వెంటనే రిజర్వేషన్ల అంశంపై టీఆర్ఎస్, కావేరీ అంశంపై అన్నాడీఎంకేలు ఆందోళన చేపట్టాయి. ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశాయి. ఈ సందర్భంగా, సభ్యులు సభను సజావుగా నడిపించడానికి సహకరించాలంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ మహా అంటే ఒకే ఒక్కసారి కోరారు.

తర్వాత కాసేపు అటూ ఇటూ చూసి... సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కేవలం మూడు నిమిషాల్లోనే సభ వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభ సమావేశాలు మాత్రం కొనసాగుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే, లోక్ సభలో ఈరోజు కూడా అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశం కనిపించడం లేదు.  

Lok Sabha
Rajya Sabha
sessions
no confidence motion
TRS
aiadmk
  • Loading...

More Telugu News